Dec 21, 2019, 11:52 AM IST
జీఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా అమరావతిలో బందులు, నిరసనలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మందడం రాజధాని రైతులు వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. రోడ్డుమీద టైర్లు కాల్చి మరీ తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. మేము భూములిచ్చింది జగన్ కో, చంద్రబాబుకో కాదు రాజధానికి, మమ్మల్నిలా అన్యాయం చేయడం కరెక్టేనా అంటూ మండిపడ్డారు.