Nov 12, 2019, 3:34 PM IST
అనంతపురం జిల్లా తాడిపత్రి సంజీవనగర్ లోని గాయత్రి మాత గుడి కూలుస్తున్నారన్న వదంతులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వానిది కూల్చివేసే సంస్కృతి కాదని, గుడిని కూలుస్తున్నట్లు వచ్చిన వార్తలు వదంతులేనని, ఆందోళన పడొద్దని తెలిపారు.