పరిపాలన రాజధాని కూడా వైసిపి కార్యకర్తలకోసమా..: మాజీ మంత్రి ఫైర్

Dec 7, 2020, 7:43 PM IST

వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలకు జవహార్ లాల్ నెహ్రూ ఫార్మాలో 2 వేల మందికి ఉద్యోగాలివ్వడానికి జగన్ సర్కార్ సిద్దమైందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చామని... అందుకోసమే ఈ నియామకాలు చేపట్టినట్లు స్వయంగా ఎంపీ విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా ఆత్మీయ సమావేశంలో చెప్పారని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పక్కనే కూర్చుని ఎందుకు మాట్లాడటం లేదన్నారు.