Feb 12, 2021, 1:12 PM IST
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావుపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు పేడపూసి అవమానించారు. ఈ విషయం గురించి తెలిసి వైసిపి శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాన్ని శుభ్రం చేయించారు పోలీసులు. అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.