పోలింగ్ కేంద్రంలో కుప్పకూలి... ఎన్నికల మహిాాళా అధికారి మృతి

Feb 17, 2021, 6:37 PM IST


ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఓ మహిళా అధికారి పోలింగ్ కేంద్రంలోనే అనారోగ్యానికి గురయి మృతిచెందిన విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మూడవ విడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా చింతూరు మండలం కోత్తపల్లి గ్రామంలో పోలింగ్ అధికారినిగా  దైవ కృపారాణి వ్యవహరిస్తున్నారు. అయితే పోలింగ్ విదుల్లో వుండగానే ఆమె అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెనె రంపచోడవరం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్య లో మృతి చెందారు. మృతురాలు కృపారాణి స్వగ్రామం  తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు అని తెలుస్తోంది.