Apr 12, 2023, 4:56 PM IST
జమ్మికుంట మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచలు తో పట్టణ సిఐ రమేష్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ రమేష్ మాట్లాడుతూ వరి, మొక్క జొన్న పంటల కోతలు మొదలయ్యయి కావున రోడ్డుపై రైతులు వరి ధాన్యo, మక్కలు ఆరబోయకుండ చూడాలని సూచించారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో, కల్లాల వద్ద ధాన్యం అరబెట్టుకోవలన్నారు. పంటలను రోడ్డుపై ఆర పెట్టడంతో గతంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. కొందరు ప్రాణాలను కోల్పోయి కుటుంబాలు వీధిన పడ్డాయని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలను రోడ్డుపై ఆరబెట్టవద్దని, ప్రత్యేక కల్లాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతీ గ్రామంలో సర్పంచులు చాటింపు వేసి రైతులకు అవగహన కల్పించాలని కోరారు. కాదని రోడ్డుపై ధాన్యాన్ని ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై యూనిస్ అహమ్మద్, జడ్పీటిసి శ్రీరామ్ శ్యామ్, వివిధ గ్రామాల సర్పంచలు, ప్రజాప్రతనిధులు పాల్గొన్నారు.