Nov 15, 2019, 12:23 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కర్నూలు నగరంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి సురేష్
ఆధ్వర్యంలో నగరంలో భవన నిర్మాణ కార్మికులకు ఆహారాన్ని అందించారు. ఇసుక కొరతతో పనులు లేక తినేకి తిండి లేక ఆకలి బాధలతో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు రెండు రోజుల పాటు ఆహార శిబిరాలను ఏర్పాటు చేశామని జనసేన పాణ్యం అభ్యర్థి చింత సురేష్ తెలిపారు.