డయేరియాతో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా...: తెంపల్లి గ్రామస్తుల ఆందోళన

Jul 20, 2022, 2:25 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని తెంపల్లి గ్రామంలో డయేరియా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ గ్రామంలో డయేరియా బారినపడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇంకా చాలామంది డయేరియాతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం, అధికారులు గ్రామాన్ని పట్టించుకోవడం లేదని... తమ గ్రామాన్ని రోగాల నుండి కాపాడలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా పారిశుద్ద్య పనులు చేపడుతున్నారని... దీంతో కొన్నాళ్ల తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని అందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి శాశ్వత డ్రైనేజ్ నిర్మించి ప్రాణాంతక రోగాలు మళ్లీ తమ ధరిచేరకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 'తాత్కాలిక పారిశుద్ద్య పనులు వద్దు - శాశ్వతం ముద్దు' 'శాశ్వత డ్రైనేజ్ నిర్మించండి ‌- తెంపల్లి గ్రామాన్ని కాపాడండి' అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ పట్టుకొని గ్రామ పంచాయితీ ముందు ప్రజలు ఆందోళన చేసారు.