విజయవాడ దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరను సమర్పించిన సిరిసిల్ల భక్తుడు

Apr 11, 2023, 6:28 PM IST

ఇంద్రకీలాద్రి అమ్మవారికి అగ్గిపెట్టిలో పట్టే చీరను సమర్పించాడు సిరిసిల్ల కు చెందిన భక్తుడు. 45 వేల రూపాయలు ఖరీదు చేసే ఈ చీరను...  ఐదు గ్రాముల బంగారం 10 గ్రాముల వెండితో పూర్తి పట్టు దారాలతో నేసారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల గ్రామం నుండి వచ్చిన విజయ్ అనే భక్తుడు  అమ్మవారికి  అగ్గిపెట్టి లో ఈ బంగారపు చీరను సమర్పించాడు. చేనేత కార్మికులు మరుగున పడిపోకూడదు అని ఈ సందర్భంగా సదరు భక్తుడు విజ్ఞప్తి చేసాడు.