కన్న కొడుకు పట్టించుకోవడంలేదంటూ ఇంటిముందు ఆమరణ నిరాహారదీక్షకు దిగిన తల్లి

Mar 5, 2022, 1:58 PM IST

తన భర్త చనిపోయిన తరువాత తన ఆస్తిని అంత కొడుకు లాక్కొని తనను వదిలేసి అమెరికా వెళ్ళిపోయి, తనను పట్టించుకోవడంలేదంటూ ఒక తల్లి ఆమరణ నిరాహారదీక్షకు దిగిన ఘటన కృష్ణ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. గత 10 సంత్సరకాలంగా అధికారులు చుట్టూ తిరుగుతూన్నా తనను పట్టించుకోవడం లేదని ఇంటి ముందు ఆమరణ నిరాహరదీక్ష కు కూర్చున్న వృద్ధురాలు... చావనైనా చస్తాను కానీ ... తనకు న్యాయం జరిగే అంతవరకు ఆమరణ దీక్ష చేస్తాను అని గరిమెళ్ల సత్యనాగకుమారి అన్నారు...!  స్పందన లో ఎన్ని సార్లు తన సమస్యా గురించి తెలిపిన తనకు న్యాయం జరగలేదని,  తన నివాసం చుట్టూ పక్కల ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న ప్రదేశం లో గోడ కి పోస్టర్లు అంటించిన వైనం అక్కడ చర్చనీయాంశంగా మారింది.