చనిపోయిన వ్యక్తికి కరోనాపాజిటివ్.. గుంటూరులో హై అలర్ట్...

Apr 11, 2020, 12:40 PM IST

గుంటూరుజిల్లా, దాచేపల్లిలో జ్వరంతో చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఎలక్ట్రీషన్ గా పనిచేసే షేక్ నాగుల్ మీరా పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. టెస్టుల్లో టైఫాయిడ్ అని తేలింది. అలాగే ఛాతిలో నెమ్ము ఉందని అన్నారు. పదిరోజులవుతున్నా జ్వరం తగ్గకపోవడంతో గుంటూరుకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. బ్లడ్ శాంపిల్స్ పరీక్షించగా అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో దాచేపల్లిని రెడ్ జోన్ గా ప్రకటించారు.