Apr 8, 2023, 10:53 AM IST
ఆన్లైన్ మోసాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం సిటీ సైబర్ క్రైమ్ సి ఐ భవాని ప్రసాద్ పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాలు ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో తో సమానంగా విశాఖలో కూడా జరుగుతున్నాయన్నారు. విశాఖలో అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని వారు ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తమ నగదును పోగొట్టుకుంటున్నారని తెలిపారు. సిటీ పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజల్లో పలు కార్యక్రమాలు ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముక్యంగా ఈ తరహా నేరగాళ్లు ఆన్లైన్ లోన్లు, వివిధ రకాలైన వస్తువులు అమ్మకాలకు చూపి, బహుమతులు వచ్చాయని అవి పొందాలంటే ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాలని చెప్పి మోసాగిస్తారని ఇటువంటి వాటిని నమ్మవద్దని సి ఐ భవానీ ప్రసాద్ తెలిపారు.