Nov 15, 2019, 9:35 AM IST
మచిలీపట్నం బస్టాండ్ సమీపంలో ఓ ఆవు జనాల్ని ఇబ్బంది పెట్టింది. రోడ్డుమీద వెడుతున్న వాహనదారుడి మీద దాడి చేసింది. అతన్ని స్థానికులు రక్షించగా...ఇంతలోనే మరో ఇద్దరిపై దాడికి దిగింది. చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఎలాగో వారిని కాపాడారు. కాసేపు హల్ చల్ చేసిన ఆవు అక్కడినుండి వెళ్లిపోయింది. సంబంధిత అధికారులు స్పందించి పశువులను రోడ్లపైకి రాకుండా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.