Nov 25, 2022, 4:12 PM IST
తాడేపల్లి : తమకు రక్షణ కల్పించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద భార్యభర్తలు ఆందోళనకు దిగారు. కులాంతర వివాహం చేసుకున్న తమను చంపడానికి బంధువులు ప్రయత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. సీఎం జగన్ కు కలిసి తమ బాధను తెలియజేసే అవకాశం కల్పించాలంటే క్యాంప్ కార్యాలయం గేటువద్ద సెక్యూరిటీ సిబ్బందిని కోరారు బాధిత దంపతులు. అయితే వారిని క్యాంప్ కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో దంపతులు పోలీసులతో వాగ్విదానికి దిగారు.
తమ ఆస్తికోసం కులాంతర వివాహాన్ని అడ్డుపెట్టుకుని భర్త బాబాయ్ లు, మరికొందరు బంధువులు కుటుంబంమొత్తాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారని రాయన అనూష ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలం బిక్కుబిక్కుమంటూ జీవించాల్సి వస్తోందన్నారు. గతంలో తమపై హత్యాయత్నం జరిగినట్లు బాధితురాలు తెలిపారు. ఎక్కడికెళ్లినా న్యాయం జరక్కపోవడంతో సీఎం జగన్ ను కలవడానికి వచ్చినట్లు దంపతులు తెలిపారు.