నడిరోడ్డుపైనే... మదనపల్లిలో ఇద్దరు కానిస్టేబుల్లు బాహాబాహీ

Jun 15, 2021, 1:38 PM IST

చిత్తూరు: కరోనా కట్టడికి కర్ఫ్యూ కొనసాగుతున్న సమయంలో ప్రజలను కట్టడి చేయాల్సిన పోలీసులే బాహాబాహీకి దిగిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారీకేడ్లు తీయాలని అటవీ కానిస్టేబుల్, తీసేదిలేదంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుబట్టడం గొడవకు దారితీసింది. ఈ ఘటన మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. బస్టాండు నుంచి బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన కంచె తొలగించాలని అటవీశాఖ ఇన్-చార్జ్ ఎఫ్ బి వో రామయ్య విధులలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ జగదీష్ ను బతిమలాడాడు. అయినా విధులలో ఉన్న కానిస్టేబుల్ అసభ్యంగా మాట్లాడుతూ.. అందరూ చూస్తుండగానే రామయ్య దాడికి యత్నించాడు. చేసేదిలేక అటవీశాఖ కానిస్టేబుల్ వెనక్కు వెళ్లి పోయాడు.