Nov 18, 2019, 12:00 PM IST
గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టై కోర్టుకు తరలిస్తుండగా తప్పించుకు పారిపోయిన కానిస్టేబుల్ పడాల్ ని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 17 తేదీన గన్నవరం పోలీసులు 240 కిలోలు గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో ఒక మహిళ సహా 12 మంది అరెస్ట్ చేయగా అందులో ఒకరు కానిస్టేబుల్ పడాల్. అక్టోబర్ 19 వ తేదిన గన్నవరం నుండి రాజమండ్రి జైలుకి బస్సులో తరలిస్తుండగా పడాల్ పరారయ్యాడు. పడాల్ గతంలో విశాఖలో చింతపల్లి పీయస్ లో ఇన్స్ పెక్టర్ గన్ ను ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడుగా ఉన్నాడు.