చంద్రబాబుకు రాఖీ కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

Aug 22, 2021, 2:24 PM IST

విజయవాడ: అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండగ సందర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ కు కూడా రాఖీ కట్టారు సీతక్క. మాజీమంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న తదితరులు కూడా చంద్రబాబుకు రాఖీ కట్టారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. రాఖీ కట్టడానికి వచ్చిన మహిళలందరినీ ఆప్యాయంగా పలకరించారు చంద్రబాబు.