Jun 3, 2022, 5:01 PM IST
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకర్గంలోని ఉంగుటూరు మండలం ఆత్మూరు కోఆపరేటివ్ బ్యాంక్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బాధితులతో కలిసి కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ శ్రీ ఆందోళనకు దిగారు. దొంగ బాండ్స్ ఇచ్చి పేదలు దాచుకున్న కోట్ల సొమ్ము కొల్లొకొట్టిన బ్యాంక్ అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. ఈ బ్యాంక్ లో జరిగిన అక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాధ్యత వహించాలని అన్నారు. తనకి అనుకూలంగా వున్న వ్యక్తిని బ్యాంక్ ప్రెసిడెంట్ గా చేసి ఎమ్మెల్యే పేదలను మోసం చేశారని పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే పోలీసులు కేసులు నమోదు చెయ్యకుండా ఏంచేస్తున్నారని నిలదీసారు. కూలీ పనులు చేసుకొని సంపాదించి బ్యాంకులో దాచుకున్న నిరుపేదల డబ్బులను దోచుకున్న వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని పద్మశ్నీ డిమాండ్ చేశారు.