వైజాగ్ లో ఘోర రోడ్డుప్రమాదం... డిల్లీ యువతిపైనుండి దూసుకెళ్లిన లారీ

Mar 17, 2022, 5:04 PM IST

విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని సత్యం చౌరస్తాలో టూ వీలర్ ను పెద్ద సరుకు రవాణా లారీ ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన యువతి మీదనుండి లారీ దూసుకెళ్లడంతో ఆమె  అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు డిల్లీవాసి సింథ్యా సమంతానియాగా తెలుస్తోంది. యువతి కళాశాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.