మిగతా రాష్ట్రాలకూ మనకూ తేడా అదే.. వైద్యులకు సెల్యూట్ : వైఎస్ జగన్

Apr 10, 2020, 5:25 PM IST

జిల్లా కలెక్టర్లు, కోవిడ్‌ఆస్పతుల వైద్యులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనా నేపధ్యంలో వైద్యులు చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. వైద్యరంగానికి సంబంధించిన అన్ని విభాగాలూ ఎంతో కృషి చేస్తున్నాయని వారికి అందరి తరఫునా ధన్యవాదాలు తెలిపారు. మిగతా రాష్ట్రాల్లాగే మనమూ చేస్తున్నా..వారికీ మనకూ ఒక తేడా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.