కోనసీమలోని వరదప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

Jul 26, 2022, 12:42 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోనసీమ వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వర్షంలోనే ఆయన పర్యటన కొనసాగుతోంది.కోనసీమ : కోనసీమ జిల్లాలోని సుమారు 51 లంక గ్రామాలు గత కొన్ని రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులకు అండగా సీఎం జగన్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. కోనసీమలో భారీ వర్షం కురుస్తున్నా సీఎం తన పర్యటన కొనసాగిస్తూ బాధితులకు ధైర్యాన్ని అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వరదల సమయంలో వశిష్ట నదిపాయ తెగిపోవడంతో లంక గ్రామవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ పంటిపై, ట్రాక్టర్పై ప్రయాణిస్తున్నారు. బాధితులకు సీఎం జగన్ నేరుగా మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.