Dec 28, 2019, 12:55 PM IST
నిన్న సాయంత్రం శ్రీశైలంలోని రుద్రా పార్కు వద్ద నలుగురు క్రైస్తవ మత గ్రంధాలను చదువుతున్న వారిని దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వీరిని అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దేవస్థానం పరిధిలో అన్యమత ప్రచారం చేయటం, అన్యమత గ్రంథాలు కలిగిఉండటం నేరం. తెలిసి కూడా నిబంధనలను అతిక్రమించినట్లయితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని శ్రీశైల
దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు.