Nov 28, 2019, 5:04 PM IST
విశాఖపట్నంలోని ములగాడ గ్రామం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. కోరమండల్ నుండి వచ్చే విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలిలో జిప్సమ్ డస్ట్ కలిసి వస్తున్న రసాయన వాయువులతో రకరకాల అలెర్జీలు, ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. ఇంత ఇబ్బందులు పడుతుంటే పొల్యూషన్ బోర్డ్ ఏం చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.