విజయనగరంలో భగ్గుమన్న కులవివక్ష... కర్రలు, రాళ్ళతో తలలు పగలగొట్టుకున్న ఎస్సీ, బిసి వర్గీయులు

Jun 26, 2022, 12:09 PM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు బిసి కాలనీలోని బోరబావి వద్ద నీరుతాగడం ఉద్రిక్తతకు దారితీసింది. నీరుతాగిన యువకుడిని బిసి కాలనీవాసులు దాడిచేసారు. దీంతో ఆగ్రహించిన ఎస్సీ కాలనీవాసులు కూడా ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. గ్రామంలో ఇటీవల జరిగిన ఓ కులాంతర వివాహం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త పెద్దదై తాజాగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ గొడవలు మరింత పెద్దవి కాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసారు.