జాతీయ రహదారిపై కారు పల్టీ..కారునిండా మద్యం సీసాలు, ట్రాఫిక్ జాం...

Sep 6, 2022, 9:16 AM IST

ఎన్టీఆర్ జిల్లా : తిరువూరు పట్టణ శివారు జాతీయ రహదారిపై కారు పల్టీ కొట్టింది. దీంతో కారులో భారీగా తరలిస్తున్న తెలంగాణ మద్యం బయటపడింది. నెం. AP 05 DR 2443 గల కారు, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అయితే తెలంగాణ నుంచి మద్యం తరలిస్తుండడంతో.. తెలంగాణ పోలీసులు వెంబడించగా కారు అదుపుతప్పి పల్టీ కొట్టినట్లు ప్రాథమిక సమచారం.