ఘరానా దొంగల ఆటకట్టించిన గుంటూరు పోలీసులు

Jun 6, 2021, 10:25 AM IST

గుంటూరు: పార్క్ చేసి వున్న బైక్ వారి కంటపడిందంటే మాయమే. ఇలా పదుల్లో ద్విచక్ర వాహనాలను దొంగించారు. ఇలా దొంగిలించిన వాహనాలను అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డారు ఈ ఘరానా దొంగలు. 

రెంటచింతలలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు పోతున్నాయని ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు గతంలో కొందరు దొంగలపై నిఘా పెట్టారు.ఈ క్రమంలోనే మాచర్ల మండలం వినాయకగుట్టకు చెందిన కొమరగిరి రాంబాబు, శీలం తిరుపతయ్య కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దొంగిలించిన వాహనాలను రెంటచింతలలోని ఓ హైస్కూల్ వద్ద విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి దొంగిలించబడ్డ 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.