ప్రేమోన్మాది శశికృష్ణను ఎన్కౌంటర్ చేయండి..: హోంమంత్రి సుచరితను కోరిన రమ్య తల్లిదండ్రులు

Aug 16, 2021, 1:30 PM IST

గుంటూరు: పట్టపగలే నడిరోడ్డుపై ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురయిన బిటెక్ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను హోం మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ఇప్పటికే వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల రూపాయలను రమ్య తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి ముందు తల్లిదండ్రులు బోరున విలపించారు. తమ కూతురిని హతమార్చిన నిందితుడు శశికృష్ణను ఎన్కౌంటర్ చేయాలని రమ్య తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శశికృష్ణను బహిరంగంగా శిక్షించేవరకు జిజిహెచ్ ఆస్పత్రి నుంచి తీసుకుని వెళ్లేది లేదని భీష్మించుకున్నారు.