విశాఖలో బ్రహ్మస్త్రం టీమ్ సందడి... పూలవర్షం, గజమాలలతో రాజమౌళి, రణబీర్ కు అత్మీయ స్వాగతం

May 31, 2022, 2:07 PM IST

విశాఖపట్నం: బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీబడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్రం. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి, బ్రహ్మాస్త్రం డెరెక్టర్ అయాన్ ముఖర్జీ, హీరో రణబీర్ కపూర్ తో పాటు మూవీ యూనిట్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో వీరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ర్యాలీగా సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ర్యాలీగా బయలుదేరారు. దారిపొడవునా రాజమౌళి, బ్రహ్మాస్త్రం మూవీ యూనిట్ కు ఘనస్వాగతం లభించింది. సింహాచలం ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ ఈవో ఎంవి సూర్యకళ, ధర్మకర్తలు, అర్చకులు స్వాగతం పలికారు. ముందుగా రాజమౌళి, రణబీర్, అయాన్ ముఖర్జీ ఆలయంలోని  కప్పస్తంభం ఆలింగనం అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ ఈవో తీర్థప్రసాదాలను అందజేశారు.