Aug 20, 2022, 3:08 PM IST
ఎన్టీఆర్ జిల్లా : నిన్న నీట మునిగిన కొండపల్లి ప్రాంతానికి చెందిన దొప్పలపూడి లోకేష్ అనే బాలుడి కథ విషాదాంతం అయ్యింది. శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం ప్రాంతంలో బాలుడు గల్లంతయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, మత్స్యకారులు గాలింపు చేపట్టారు. కాగా, ఆచూకీ లభ్యమయ్యింది. బాలుడి మృతదేహం విజయవాడ ప్రకాశం బ్యారేజీ 55వ గేటు వద్ద లభ్యమయ్యింది. దీంతో బాలుడు లోకేష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. లోకేష్ మృతదేహం వెలికి తీసేందుకు ఇబ్రహీంపట్నం సిఐ శ్రీను ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు.