Nov 16, 2019, 12:18 PM IST
స్నేహం వేరు, రాజకీయం వేరని బోడె ప్రసాద్ అన్నారు. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని వంశీకి హితవు పలికారు. అధిష్టానం సూచన మేరకు అలక వహించిన రాజేంద్ర ప్రసాద్ ను బోడె ప్రసాద్ కలిశారు. రాజకీయ నాయకులంటేనే ఏవగింపుగా తయారయ్యారని రాజేంద్ర ప్రసాద్ తో భేటీ తర్వాత బోడె ప్రసాద్ అన్నారు. వై.వి.బి రాజేంద్రప్రసాద్ ను వ్యక్తిగతంగా దూషించడం అసమంజసమని ఆయన అన్నారు. వంశీ స్నేహితుడి నయినా టిడిపి నుంచి మారబోనని ఆయన స్పష్టం చేశారు.