సముద్రంలో పడవ బోల్తా... పదిమంది మత్స్యకారులను కాపాడిన మెరైన్ పోలీసులు

Jul 28, 2022, 5:00 PM IST

కాకినాడ : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు సముద్రంలో గళ్లంతయిన ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. కాకినాడ నుండి పదిమంది మత్స్యకారులు ఓ బోట్ లో చేపల వేటకు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బోట్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం సమీపంలో వుండగా బోల్తా పడింది. దీంతో పదిమంది మత్స్యకారులు సముద్రంలో మునిగి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన మైరైన్ పోలీసులు ఒ.ఎన్.జీ.సి హెలికాప్టర్ సహాయంతో మత్స్యకారులను సురక్షితంగా కాపాడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.