ప్రధాని మోదీ హెలికాప్టర్ సమీపంలో నల్లబెలూన్లు కలకలం... ఇది వీరిపనే...

Jul 4, 2022, 4:47 PM IST

అమరావతి : మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. అయితే ప్రధాని పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ బెలూన్లు ఎగరేసారు. ఈ బెలూన్లు ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు అత్యంత సమీపంలో ఎగరడం తీవ్ర కలకలం రేగింది. ప్రధాని ప్రయాణించే మార్గంలో బెలూన్లు ప్రత్యక్షం కావడాన్ని సెక్యూరిటీ లోపంగా పరిగణిస్తూ కేంద్రం సీరియస్ గా తీసుకొన్నట్లు సమాచారం. విజయవాడ సమీపంలోని ఓ కన్ట్రక్షన్ బిల్డింగ్  పై నుండి ఈ బెలూన్లు ఎగరేసినట్లు సమాచారం. బెలూన్లు ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీతో పాటు మరో ముగ్గురు  అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ విజయ్ పాల్ తెలిపారు.  మరికొంత మందిని అరెస్ట్ చేయవలసి వుందన్నారు. ప్రధాని భద్రత విషయంలో ఎలాంటి వైఫల్యం లేదని డిఎస్పీ తెలిపారు.