Apr 8, 2022, 3:45 PM IST
విజయవాడ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెచ్చిన చట్టంవల్లే ఏపీలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయంటూ రాష్ట్రంలో కరెంటు కోతలపై మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ కౌంటరించారు. చేతగాని అసమర్థ పాలన వల్లే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని... దీన్ని ఇతరులపై నెట్టి పారిపోవాలనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. విద్యుత్ కంపెనీలకు పాత బకాయిలు తీర్చకపోవడం వల్లే నేడు విద్యుత్ సమస్య తలెత్తిందన్నారు. ప్రభుత్వం రూ.22,000 కోట్ల అప్పులు చెల్లించాలని... వాటిని ఎందుకు చెల్లించలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్సాఆర్ లాంతర్ల పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుందేమో? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేసారు.