కొండారెడ్డి బురుజా లేక కోటిరెడ్డి సెంటరా..?: సిపిఐ రామకృష్ణ సవాల్ కు బిజెపి విష్ణువర్ధన్ ప్రతిసవాల్

Mar 22, 2022, 4:06 PM IST

విజయవాడ: రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై సోము వీర్రాజు బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చేసిన సవాల్ పై ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. రామకృష్ణ సవాల్ ను స్వీకరిస్తున్నామని... తేది ఎప్పుడో చెప్పాలని అడిగారు. రాయలసీమలోని కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద చర్చించుకుందామా?  లేదంటే కడప కోటిరెడ్డి సర్కిల్ వద్దనా?... ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్దం... మీరే నిర్ణయించండని రామకృష్ణకు విష్ణువర్ధన్ ప్రతిసవాల్ విసిరారు.