ఆ పోరాటంలో జగన్ సర్కార్ విఫలం... బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ నిరసన

May 23, 2021, 1:52 PM IST

విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా కట్టడి చేయడంలో జగన్ సర్కార్ విఫలమైందని బిజెపి నాయకులు ఆరోపించారు. కోవిడ్ నిబంధనలను సమర్ధవంతంగా అమలుచేయడంలో  వైసిపి ప్రభుత్వం వైఫల్యం చెందిందని... ఇందుకు నిరసనగా విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు నిరసనకు దిగారు.