సొంత గూటికి వైసిపి.. మంత్రి అవంతి మాటలే నిదర్శనం: బిజెపి విష్ణువర్ధన్ రెడ్డి

Feb 10, 2021, 1:13 PM IST

గుంటూరు: దేశ ప్రధాని మోడీ గారి గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ లు నోరు అదుపులో పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఇందిరా గాంధీగారు మోడీ గారి కంటే 100 రెట్లు బలమైన నాయకురాలు అన్న మంత్రి అవంతి మాటలను బట్టి చూస్తే సొంత గూటికి చేరే తాపత్రయంలో వైసిపి ఉన్నట్లుగా అర్థమవుతుందన్నారు. ''నిజమే...! నాడు దేశంలో ప్రత్యక్షంగా ఎమర్జెన్సీ పెట్టింది. నేడు ఆంధ్రాలో మీ వైసీపీ ప్రభుత్వ పాలన పరోక్షంగా ఎమర్జెన్సీని తలపిస్తోంది...!'' అని విష్ణువర్ధన్ ఎద్దేవా చేశారు.