రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన... ఘనస్వాగతం పలికేందుకు సిద్దమైన బిజెపి, వైసిపి

Jul 12, 2022, 4:36 PM IST

గన్నవరం : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ (మంగళవారం) ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికేందుకు బిజెపి, వైసిపి నాయకులు గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు,ఎంపీలు సీఎం రమేష్, జీ.వీ.ఎల్ తదితరులు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికేందుకు  వైసిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గిరిజన రాష్ట్రపతి అభ్యర్థికి స్వాగతం పలికేందుకు గిరిజన సాంప్రదాయ నృత్యాలు ఏర్పాటుచేసారు.