Nov 30, 2022, 3:23 PM IST
నందిగామ : కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం ఈఎస్ఐ హాస్పిటల్ ను పున:ప్రారంభించాలంటూ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో బిజెపి, జనసేన పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో చెవిటికల్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి, స్థానిక తహసీల్దార్ కు ఈఎస్ఐ హాస్పిటల్ తెరవాలంటూ వినతిపత్రం అందించారు. పేషెంట్స్ తక్కువగా వస్తున్నారనే నెపంతో హాస్పిటల్ మూసేయడం దారుణమని... వెంటనే దీన్ని తిరిగి ప్రారంభించకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని అన్నారు.