Jul 29, 2022, 5:06 PM IST
అమరావతి : 'మనం మన అమరావతి' పేరుతో పాదయాత్ర చేపట్టిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆరంభంలోనే ఛేదు అనుభవం ఎదురయ్యింది. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామంలో పాదయాత్ర చేస్తున్న వీర్రాజును స్థానిక రైతులు నిలదీసారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైఎస్సార్ సిపి రెండూ తోడుదొంగలేనని... ఇద్దరూ కలిసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసారంటూ వీర్రాజు ముందే రైతులు మండిపడ్డారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని సోమువీర్రాజును రాజదాని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు ఓకే రాజధాని వుంటుందని బీజేపీ గతంలోనే చెప్పిందని... కేంద్రం కూడా ఇదే మాటకు కట్టుబడి ఉంటుందని అమరావతి రైతులకు సోమువీర్రాజు సముదాయించే ప్రయత్నం చేసారు.