Aug 8, 2022, 5:31 PM IST
మచిలీపట్నం : అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో భారీ తిరంగ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో పోలీసులు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల సంయుక్తంగా భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఇక ఉంగుటూరు నుండి ఆముదాలపల్లి సెంటర్ వరకు 250 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ కొనసాగింది.