కాలువలోకి దూసుకెళ్లిన ఆటో... జగనన్న విద్యాకానుక వస్తువులు నీటిపాలు

Jul 4, 2022, 4:51 PM IST

నెల్లూరు :  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం వద్ద విద్యాకానుక కింద విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన వస్తువులను తరలిస్తున్న ఆటో బోల్తాపడింది. విద్యాకానుక వస్తువుల లోడుతో వేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి నీటికాలువలోకి దూసుకెళ్లింది. దీంతో నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాలు నీటమునిగాయి. దీంతో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిహెచ్ ఉషారాణి, సీఎంఓ ఎస్ భాస్కర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని నీటిలో నుండి బయటకు తీస్తున్న అధికారులు