పట్టాభిపై దాడి, దుండగులు పారిపోతున్న దృశ్యాలు... సిసి కెమెరాల్లో రికార్డు

Feb 2, 2021, 1:58 PM IST

విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కారుపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో పట్టాభి గాయపడ్డారు. ఇంటి నుండి పార్టీ కార్యాలయానికి బయలుదేరగా మార్గ మధ్యలో తనపై దాడి జరిగినట్లు పట్టాభి వెల్లడించారు. పెద్ద బండరాళ్ల, రాడ్ లతో దాడి చేయడంతో కారు అద్దాలు పగిలి అందులో వున్న తమకు గాయాలైనట్లు తెలిపారు. అయితే ఈ దాడి దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. పట్టాభిరాం కారుపై దాడి, ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై దుండగులు పారిపోతున్న వీడియోలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.