సీఎం జగన్ అనుమానించినట్లే... వాటిపైనా దాడులు మొదలయ్యాయా?

Mar 4, 2021, 6:17 PM IST

నాడు నేడుతో బడులు కళకళలాడుతున్నాయని...ఇది చూసి టీడీపీ నేతల కళ్ళు మండుతున్నాయన్నారు... ఓర్వలేక బడులు మీద కూడా దాడులు చేస్తారని సీఎం జగన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన అనుమానించినట్లే ఏపీలో బడులపైనా దాడులు మొదలయ్యాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుల గది, తరగతి గది తలుపులు, ఓ బీరువాని పగలగొట్టారు. అలాగే బీరువాలోని పుస్తకాలను సైతం ధ్వంసం చేశారు.