విశాఖలో ఘరానా చోరి ముఠా అరెస్ట్... 125 ఏటిఎం కార్డ్స్ స్వాధీనం

Jun 8, 2022, 11:19 AM IST

విశాఖపట్నం: హైటెక్నాలజీని ఉపయోగించి ఏటిఎం మోసాలకు పాల్పడుతున్న హర్యానా ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేసారు. ఏటిఎంల వద్ద కాపుకాసి అమాయకుల నుండి కార్డులను దొంగిలించి అకౌంట్ లో డబ్బులను మాయం చేస్తున్నారని  డీసీపీ గంగాధర్ తెలిపారు. విశాఖతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలోనూ ఈ గ్యాంగ్ పై 12 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ గ్యాంగ్ ఇతర రాష్ట్రాలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు.  నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారినుండి 125 ఎటిఎం కార్డ్స్, 29 వేల నగదు, ఓ స్వైపింగ్ యంత్రం, ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి తెలిపారు. ఈ గ్యాంగ్ మళ్ళీ నేరాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఏటీఎంను ఉపయోగించేపుడు అప్రమత్తంగా ఉండాలని డిసిపి గంగాధర్ సూచించారు.