Dec 7, 2019, 4:58 PM IST
సాయం చేస్తానంటూ..మాయమాటలతో మోసం చేసే ఘరానా దొంగను తూర్పుగోదావరి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఏటిఎమ్ ల దగ్గర క్యాష్ విత్ డ్రా చేసిస్తానని చెప్పి అమాయకులను మోసం చేస్తున్న ఓ దొంగను అరెస్ట్ చేశారు. అతని దగ్గరినుండి 180000 నగదు, ఏటియమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.