Jul 1, 2020, 7:50 PM IST
గుంటూరు: ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుండి పోలీసులు ఆయనను నేరుగా సబ్‌జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక అంబులెన్సులో అచ్చెన్నాయుడిని జైలుకు తీసుకెళ్లారు. ఆస్పత్రిలో నుండి వీల్ చైర్ పై బయటకు తీసుకువచ్చి అంబులెన్స్ లో జైలుకు తరలించారు. ఈ సమయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కొందరు అచ్చెన్నాయుడికి మద్దతుగా, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు అచ్చెన్నాయుడిని అక్కడి నుండి తరలించారు.