ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాస సారె మహోత్సవం... దుర్గమ్మకు పట్టువస్త్రాలు

Jul 11, 2021, 6:33 PM IST


విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ హిందూ దేవాలయమైన బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఇవాళ(ఆదివారం) ఆషాఢ మాస పవిత్ర సారె మహోత్సవం వైభవంగా ప్రారంభమయ్యింది. 
మేళ తాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించారు దుర్గగుడి అర్చకులు, వైదిక కమిటీ, వేద పండితులు. 

ఆషాఢ మాసం సారె మహోత్సవం తొలి రోజున అమ్మవారికి ఆలయ అర్చకులు సారెను సమర్పించడం ఆనవాయితీ. అర్చకులు సమర్పించిన పవిత్ర సారెకు  దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈబో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 3 లక్షల 30 వేల రూపాయలతో అమ్మవారికి మయూరి హారాన్ని సమర్పించారు వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు.