విశాఖపట్నంలో ఆశా వర్కర్ల ఆందోళన... డిమాండ్లివే..

Jun 7, 2022, 12:22 PM IST

విశాఖపట్నం: తమ సమస్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  విశాఖపట్నం మద్దిలపాలెంలో సిఐటియూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. గౌరవవేతనం రూ.15 వేలకు పెంచాలని కోరుతూ ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలో నిత్యావసర సరుకుల ధరలు 300 రెట్లు పెరిగాయనీ... ఈ క్రమంలో ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.10 వేల వేతనం ఎందుకూ సరిపోవడం లేదని అన్నారు. ఇందులో నెలకు మూడువేల వరకు డ్యూటీ సమయంలో ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. టిఎ, డిఎ లతో పాటు కోవిడ్ ప్రత్యేక అలవెన్స్ కూడా చెల్లించటం లేదని ఆశా వర్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు
 
కోవిడ్ డ్యూటీలు ప్రారంభం నాటినుండి 24 గంటలు పనిచేయాల్సి వస్తుందనీ... పనిభారం కూడా చాలా ఎక్కువయిందని తెలిపారు. తమకు పనిభారం తగ్గించాలని, సంక్షేమపథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, కోవిడ్ కాలంలో మరణించిన ఆశాల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్రేషియో ఇవ్వాలని ఆశా వర్లర్లు డిమాండ్ చేశారు.