Apr 18, 2022, 12:32 PM IST
కృష్ణా జిల్లా గన్నవరంలో పట్టపగలే ఓ ఘరానా దొంగ చేతివాటం చూపించాడు. పట్టణంలోని ఆర్టిసి బస్టాండ్ ఎదురుగా వున్న ఓ పాన్ షాప్ వద్దకు కస్టమర్ మాదిరిగా వచ్చిన దొంగ ఐపోన్ దొంగిలించాడు. పాన్ షాప్ ఓనర్ కాస్త ఏమరపాటుగా వుండటంతో చాకచక్యంగా రెప్పపాటులో ఐపోన్ దొంగిలించి జేబులో వేసుకుని పరారయ్యాడు. అయితే తన ఐపోన్ పోయినట్లు గురించిన పాన్ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో షాప్ వద్దగల సిసి కెమెరాను పరిశీలించగా దొంగతనం వీడియో బయటపడింది. ఈ వీడియో ఆదారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.