Feb 2, 2021, 9:51 AM IST
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాళి స్టేషన్ కు తరలించారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించాడనే ఆరోపణపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందులో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారు.